భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన Sports Authority of India (SAI) సంస్థ 2026 సంవత్సరానికి గాను Assistant Coach పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 100 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.ఈ నియామక ప్రక్రియ Deputation (Short-Term Contract సహా) పద్ధతిలో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత శాఖ ద్వారా 27 జూన్ 2026 సాయంత్రం 5 గంటలలోపు పంపించాలి.
