NHSRCL Recruitment 2026 Notification
భారతదేశపు తొలి హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ అయిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో పనిచేయడానికి ఆసక్తి ఉన్న రైల్వే ఉద్యోగులకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) శుభవార్త అందించింది.
NHSRCL సంస్థ మొత్తం 209 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు Absorption Basis ద్వారా నిర్వహించబడతాయి.
ఈ నియామకాలలో డిప్యూటీ ఇంజనీర్, డిప్యూటీ చీఫ్ కంట్రోలర్, జూనియర్ ఇంజనీర్, కంట్రోలర్, ట్రైన్ మేనేజర్ మరియు స్టేషన్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.
ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్, మెట్రో రైల్వేస్, గవర్నమెంట్ రైల్వే సంస్థలు లేదా RRTS వ్యవస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
