DMHO అనంతపురం రిక్రూట్మెంట్ 2026 – 10వ తరగతి అర్హతతో Cook-Cum-Care Taker ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానం
DMHO అనంతపురం రిక్రూట్మెంట్ 2026-ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ (DMHO) అనంతపురం Cook-Cum-Care Taker పోస్టు భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన చేపట్టబడుతోంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నియామక ప్రక్రియలో మొత్తం 1 ఖాళీని భర్తీ చేయనున్నారు.
ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.15,000 వేతనం అందజేయబడుతుంది. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ప్రభుత్వ సంస్థలో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
