IGCAR Trade Apprentice Recruitment 2026 – 200 ITI Apprentice పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | నెలకు ₹11,040 స్టైపెండ్ | పూర్తి వివరాలు
IGCAR Trade Apprentice Recruitment 2026- భారత ప్రభుత్వ అణుశక్తి విభాగం (Department of Atomic Energy - DAE) ఆధ్వర్యంలోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR), కల్పక్కం నుండి Trade Apprentices Recruitment 2026 (Advertisement No. IGCAR/03/2026) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 200 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
సంబంధిత ట్రేడ్లో ITI (NCVT/SCVT) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఒక సంవత్సరం శిక్షణ ఇవ్వబడుతుంది. 2 సంవత్సరాల ITI చేసిన వారికి నెలకు రూ.11,040, 1 సంవత్సరం ITI చేసిన వారికి రూ.10,560 స్టైపెండ్ చెల్లిస్తారు.ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20 జూలై 2026 నుండి 19 ఆగస్టు 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన అర్హతలు, వయస్సు, ట్రేడ్ వారీ ఖాళీలు, ఎంపిక విధానం, స్టైపెండ్, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలను క్రింద తెలుసుకుందాం.
