AIIMS CRE-5 Recruitment 2026: 1,484 గ్రూప్ B & C పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – జూన్ 30 వరకు దరఖాస్తు అవకాశం
All India Institute of Medical Sciences ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Common Recruitment Examination-5 (CRE-5) కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న 28 AIIMS మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మొత్తం 1,484 గ్రూప్ B మరియు గ్రూప్ C నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు 2026 జూన్ 30 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)ను తాత్కాలికంగా జూలై 25 నుంచి 27, 2026 మధ్య నిర్వహించనున్నారు.
