CNP నాసిక్ రిక్రూట్‌మెంట్ 2026 – 534 జూనియర్ టెక్నీషియన్, సూపర్వైజర్ & ఇతర పోస్టులు | ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం
భారత ప్రభుత్వానికి చెందిన Currency Note Press Nashik మరియు Security Printing and Minting Corporation of India Limited (SPMCIL) ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 534 పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ టెక్నీషియన్, సూపర్వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, వెల్ఫేర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్ వంటి పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.10వ తరగతి, ITI, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై ఉండగా, చివరి తేదీ 03 జూన్ 2026.