ISRO SDSC SHAR టీచర్ రిక్రూట్మెంట్ 2026:
10 TGT, ప్రైమరీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆధ్వర్యంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ (SDSC SHAR), శ్రీహరికోట టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
SDSC SHAR/RMT/01/2026 ప్రకటన ద్వారా మొత్తం 10 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), ప్రైమరీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు 2026 జూన్ 16 నుంచి జూలై 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన అభ్యర్థులు శ్రీహరికోట, సుళ్లూరుపేటలోని స్పేస్ సెంట్రల్ స్కూళ్లలో పని చేయాల్సి ఉంటుంది.
