PDIL Diploma Engineer Recruitment 2026 Notification Out – 23 Diploma Engineer Posts | Apply Online
PDIL Diploma Engineer Recruitment 2026:
Projects & Development India Limited (PDIL) నుండి Diploma Engineer పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు పూర్తిగా Contract Basis పై జరుగుతున్నాయి. సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, ప్రాసెస్ వంటి విభాగాల్లో అనుభవం కలిగిన డిప్లొమా ఇంజనీర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మొత్తం 23 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఉన్న PDIL కార్యాలయాలు మరియు ప్రాజెక్ట్ సైట్లలో నియమిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
PDIL భారత ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సంస్థ. ఎరువులు, ఆయిల్ & గ్యాస్, పెట్రోకెమికల్స్, పవర్, హౌసింగ్ మరియు ఇతర మౌలిక సదుపాయాల రంగాలలో అనేక కీలక ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తోంది. మంచి జీతం, ప్రతిష్టాత్మక సంస్థలో పని చేసే అవకాశం కోరుకునే డిప్లొమా ఇంజనీర్లకు ఇది మంచి అవకాశం.
